జేఎన్‌టీయూ దూరవిద్యలో 3 కొత్త కోర్సులు
ABN , First Publish Date - 2023-04-05T03:35:01+05:30 IST
దూరవిద్యలో కొత్తగా మరో మూడు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): దూరవిద్యలో కొత్తగా మరో మూడు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది. కొత్త కోర్సుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవలప్స్, డేటాసైన్స్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్, వీఎల్‌ఎ్‌సఐ ఫిజికల్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో పాటు ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ పట్టభద్రులు అలాగే డిప్లమా పూర్తిచేసిన వారు కూడా సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునేందుకు వీలుగా వీటిని డిజైన్ చేస్తున్నారు. కొత్త కోర్సుల్లో ప్రవేశాలకై ఈ నెల రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది.