23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2023-09-12T03:52:29+05:30 IST

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యంలో వివిధ

23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం

రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యంలో వివిధ విభాగాల్లో సేవలందించిన 23 మంది ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు. సోమవారం హైదరాబాద్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్‌ కే.ఐ.వరప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. పురస్కార గ్రహీతలు చెన్నమనేని హన్మంతరావు (ఆధ్యాత్మిక సాహిత్యం), వెలుదండ వెంకటేశ్వరరావు (ప్రాచీన సాహిత్యం), సంగెవేని రవీంద్ర (కాల్పనిక సాహిత్యం), చేవూరు సుబ్బారావు (అనువాద సాహిత్యం), రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ (అనువాదం), సంగనభట్ల చిన్న రామకిష్టయ్య (బాల సాహిత్యం), రేగులపాటి విజయలక్ష్మి (ఉత్తమ రచయిత్రి), చలసాని వసుమతి (ఉత్తమ రచయిత్రి), కె.ప్రభాకర్‌ (వచన కవిత), చెరుకు సత్యనారాయణరెడ్డి (గేయ కవిత), సందాపురం బిచ్చయ్య (పద్య రచన), కూర చిదంబరం (కథ), చుండూరు సీత (నవల), రాచమల్ల ఉపేందర్‌ (హాస్య రచన), ఎస్‌.ఆర్‌.పృఽథ్వీ (వివిధ ప్రక్రియలు), వెంకూ (జనరంజక విజ్ఞానం), గుంజి వెంకటరత్నం (పరిశోధన), అన్నంరాజు సుబ్బారావు (సాహిత్య విమర్శ), వేముల వెంకటేశ్వర్లు (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), వల్లూరి రమేశ్‌ (అవధానం), షేక్‌ హసీన (జీవిత చరిత్ర)లను ఆయన సత్కరించి అభినందించారు.

Updated Date - 2023-09-12T03:52:29+05:30 IST