Share News

TS News: శంషాబాద్‌లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏదే: తెలంగాణ హైకోర్టు

ABN , Publish Date - Dec 14 , 2023 | 08:00 PM

శంషాబాద్‌‌లోని 181 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏదేనని (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భూ ఆక్రమణదారుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

TS News: శంషాబాద్‌లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏదే: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: శంషాబాద్‌‌లోని 181 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏదేనని (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భూ ఆక్రమణదారుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు (గురువారం) తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల చొరవతో హెచ్ఎండీఏ ఈ కేసు గెలిచింది. తప్పుడు భూరికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును హైకోర్టు తప్పుబట్టింది.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని హెచ్ఎండీఏ ఫిర్యాదు చేసింది. 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారన్న వాదనలు వినిపించింది. సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారన్న తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు ఆక్రమణదారుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Updated Date - Dec 14 , 2023 | 08:00 PM