బంగారు, వెండి పోగులతో 1.80 లక్షల పట్టుచీర
ABN , First Publish Date - 2023-08-06T03:32:08+05:30 IST
సిరిసిల్లకు చెందిన చేనత కళాకారుడు నల్ల విజయ్ మగ్గంపై మరో ప్రయోగం చేశారు.
సిరిస్లిల నేత కళాకారుడు విజయ్ ప్రయోగం
సిరిసిల్ల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లకు చెందిన చేనత కళాకారుడు నల్ల విజయ్ మగ్గంపై మరో ప్రయోగం చేశారు. ఇప్పటికే అగ్గిపెట్టేలో అమరే చీర, ఉంగరంలో దూరే చీర వంటి విభిన్నమైన వస్త్రాలను రూపొందించిన విజయ్.. ఇప్పుడు బంగారు, వెండి పోగులతో కలిపి ఓ పట్టు చీరను నేశారు. 5.50 మీటర్ల పొడవు 48 ఇంచుల పన్నాతో 500 గ్రాములు ఉండే ఈ చీర తయారీలో 20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వాడారు. రూ.1.80 లక్షల విలువైన ఈ పట్టుచీరను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురి పెళ్లి నిమిత్తం చేయించుకున్నారు.