రెండేళ్లలో 1600 కోట్ల నష్టాల తగ్గింపు!

ABN , First Publish Date - 2023-10-04T03:53:09+05:30 IST

గడిచిన రెండేళ్లలో ఆర్టీసీలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించినట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ. సజ్జనార్‌ తెలిపారు.

రెండేళ్లలో 1600 కోట్ల నష్టాల తగ్గింపు!

ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గడిచిన రెండేళ్లలో ఆర్టీసీలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించినట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ. సజ్జనార్‌ తెలిపారు. ఫలితంగా ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించగలిగినట్టు ఆయన పేర్కొన్నారు. పదవీ కాలం పూర్తి చేసిన ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ దంపతులను ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు మంగళవారం సాయంత్రం బస్‌భవన్‌లో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన కాలం మరిచిపోలేనని చెప్పారు. తాను, ఎండీగా సజ్జనార్‌ ప్రయాణికులకు మెరుగైన ేసవలు అందిస్తూనే.. సంస్థ బాగుండాలని, 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని అనునిత్యం తపించామని చెప్పారు.

Updated Date - 2023-10-04T03:53:09+05:30 IST