1534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతల తొలి దశ

ABN , First Publish Date - 2023-05-13T02:41:45+05:30 IST

అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 57,200 ఎకరాలకు సాగునీటితోపాటు పలు గ్రామాలకు తాగునీటిని అందించడానికి అచ్చంపేట ఎత్తిపోతల పథకం ఒకటో దశను రూ.1,534.50 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ..

1534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతల తొలి దశ

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 57,200 ఎకరాలకు సాగునీటితోపాటు పలు గ్రామాలకు తాగునీటిని అందించడానికి అచ్చంపేట ఎత్తిపోతల పథకం ఒకటో దశను రూ.1,534.50 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చేపట్టిన ఏదుల రిజర్వాయర్‌ నుంచి 5 టీఎంసీలను ఈ పథకం కింద ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు తరలిస్తారు. తర్వాత 57,200 ఎకరాలకు నీరందించేందుకు రిజర్వాయర్‌తోపాటు కాల్వల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని కింద సీఎం అండ్‌ సీడీ పనులు, అప్రోచ్‌ చానల్‌, కెనాల్‌ లైనింగ్‌ వంటి పనులు చేపడతారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 6.5 టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్‌ను నిర్మిస్తుండగా దాని నుంచి 5 టీఎంసీలను అచ్చంపేట ఎత్తిపోతల పథకం కింద తరలించనున్నారు.

Updated Date - 2023-05-13T02:41:45+05:30 IST