నాలుగున్నరేళ్లలో రూ.1300కోట్లతో అభివృద్ధి
ABN , First Publish Date - 2023-05-26T01:01:32+05:30 IST
గత పాలకులు 25 ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని తాను నాలుగున్నరేళ్లలోనే రూ.1300 కోట్లతో నల్లగొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కంచ ర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

నాలుగున్నరేళ్లలో రూ.1300కోట్లతో అభివృద్ధి
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ, మే 25: గత పాలకులు 25 ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని తాను నాలుగున్నరేళ్లలోనే రూ.1300 కోట్లతో నల్లగొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కంచ ర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న ఐటీహబ్‌ను గురువారం పరిశీలించిన అనంతరం ఆయన వి లేకరులతో మాట్లాడారు. నా చివరి రక్తపుబొట్టు వరకు నల్లగొండ అభివృద్ధి కోసమే కృషి చేస్తానని, అభివృద్ధిని చూసి కొంత మంది ఓ ర్వలేక అనవసరమైన విషయాల్లో బదనాం చేస్తున్నారని ఆరోపించా రు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయం లో విజిలెన్స తనిఖీలకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. 20 ఏ ళ్ల పాటు ఎమ్మెల్యేగా, 5 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగుతున్న ఓ నా యకుడు గత ముఖ్యమంత్రి చెవిలో గుసగుసలు చెప్పి ఐటీహబ్‌ను తెస్తానని చెప్పి యువకులను మోసం చేశారని అన్నారు. తన హయాంలో ఐటీ హబ్‌ను ప్రారంభించడంతో పాటు మంత్రి కేటీఆర్ అమెరికాలో 16 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు మురిగిపోయిన గుడ్లలాంటి వారని వాళ్ల వల్ల ఏ ఒక్క పని కాదన్నారు. అభివృద్ధి విషయంలో గడియారం సెంటర్‌లో మేధావుల వద్ద తెలుసుకోవడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. గత పాలకుల చేతిలో నలిగిపోయిన నల్లగొండను నలువైపులా అభివృద్ధి చేస్తున్నారని, నల్లగొండలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు, ప్రారంభాలకు మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఆయన వెల్లడించారు. పట్టణంలో పలు పనులకు విడుదలైన నిధులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన మందడి సైదిరెడ్డి, వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన చీర పంకజ్ యాదవ్, నాయకులు ని రంజనవలీ, అబ్బగోని రమేష్, కటికం సత్తయ్యగౌడ్, సుంకరి మల్లే్‌షగౌడ్, బొర్ర సుధాకర్, కరీంపాషా, బోనగిరి దేవేందర్, బక్క పిచ్చ య్య, కొండూరు సత్యనారాయణ, సందినేని జనార్థనరావు, అభిమ న్యు శ్రీనివాస్, ఆలకుంట్ల నాగరత్నంరాజు, దేప వెంకట్‌రెడ్డి, పున్న గ ణేష్, ఎడ్ల శ్రీనివాస్, రావుల శ్రీనివా్‌సరెడ్డి, ఆలకుంట్ల మోహనబాబు, యామ దయాకర్, బకరం వెంకన్న, రుద్రాక్షి వెంకన్న, లక్ష్మి, ధనలక్ష్మి, రూప, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.