100 శాతం వసూళ్లే లక్ష్యం
ABN , First Publish Date - 2023-05-03T00:10:52+05:30 IST
భువనగిరి మునిసిపాలిటీలో 2023-24 ఆర్థిక సంవత్సరాని కి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలుకు బుధవారం నుం చి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ లో 100 శాతం లైసెన్స్ ఫీజు ను వసూలు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మునిసిపల్ కమిషనర్ బి.నాగిరెడ్డి మాట్లాడుతూ నిర్ధేశిత బృందాలు లైసెన్స్ ఫీజు వసూలుకు ప్రత్యేకశ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవన్నారు.
నేటి నుంచి భువనగిరిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లకు స్పెషల్ డ్రైవ్
భువనగిరి టౌన్, మే 2: భువనగిరి మునిసిపాలిటీలో 2023-24 ఆర్థిక సంవత్సరాని కి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలుకు బుధవారం నుం చి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ లో 100 శాతం లైసెన్స్ ఫీజు ను వసూలు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మునిసిపల్ కమిషనర్ బి.నాగిరెడ్డి మాట్లాడుతూ నిర్ధేశిత బృందాలు లైసెన్స్ ఫీజు వసూలుకు ప్రత్యేకశ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవన్నారు. కాగా పట్టణంలోని 1,396 ట్రేడ్ లైసెన్స్‌ల నుంచి లైసెన్స్ ఫీజును వసూలు చేసేందుకు మునిసిపల్ అధికారు లు ఆరు టీంలను ఏర్పాటుచేశారు. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున సిబ్బంది ఉంటారు.
గతానికంటే తగ్గనున్న లైసెన్స్ ఫీజు
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవంత్సరంలో లైసెన్స్ ఫీజు గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వ సరళీకృత విధానంతో పాటు లైసెన్స్‌ల రెన్యువల్స్ అధికంగా ఉండడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూపేణా మునిసిపాలిటీకి రూ.1.49 కోట్లు ఆదా యం లభించి రాష్ట్రంలో టాప్ 5లో నిలిచింది. ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ నుంచే రూ.60.06లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు లభించింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో పరిశ్రమల నుంచి భారీ మొత్తంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు లభించింది. కానీ అధిక మొత్తంలో ట్రే డ్ లైసెన్స్ ఫీజు వసూళ్లు చేయడాన్ని సవాల్ చేస్తూ భువనగిరి ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీతో సహా పలు పరిశ్రమలు కోర్టును ఆశ్రయించాయి. ఆ వివాదాలు ఇంకా కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం 10నెల ల క్రితం ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల విధానంలో నూతన నిబంధనలను అమల్లోకి తె చ్చింది. ఈమేరకు పరిశ్రమల టర్నోవర్, భవనాల విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా గరిష్ఠం గా రూ.2లక్షలు, బాణసంచా తదితర ప్రమాదకర వ్యాపారాలకు రూ.1.50లక్షలు, సాధార ణ వ్యాపారాలకు రూ.1లక్షకు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో భువనగిరి మునిసిపాలిటీతోపాటు మిగతా పలు మునిసిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ ఆదాయం గణనీయంగా తగ్గనుంది. అలాగే హరిత నిధి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు భువనగిరి మునిసిపాలిటీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.60లక్షలే లైసెన్స్ ఫీజు వసూలు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.