యువ భారత్ ఘన బోణీ
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:32 AM
స్పిన్నర్ సౌమీ పాండే (6/29) ఆరు వికెట్లతో, ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (112 నాటౌట్) సెంచరీతో చెలరేగిన వేళ..ముక్కోణపు వన్డే టోర్నీలో భారత్
ఆరు వికెట్లతో అఫ్ఘాన్‌పై గెలుపు
అండర్-19 ముక్కోణపు టోర్నీ
జొహాన్నెస్‌బర్గ్: స్పిన్నర్ సౌమీ పాండే (6/29) ఆరు వికెట్లతో, ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (112 నాటౌట్) సెంచరీతో చెలరేగిన వేళ..ముక్కోణపు వన్డే టోర్నీలో భారత్ అండర్-19 జట్టు ఘనమైన బోణీ చేసింది. శుక్రవారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 6 వికెట్లతో అప్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. మొదట అఫ్ఘానిస్థాన్ 48.2 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. సొహైల్ (71), హసన్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. ఆదర్శ్ సింగ్‌తోపాటు ముషీర్ ఖాన్ (39 నాటౌట్) సత్తా చాటడంతో 36.4 ఓవర్లలో 202/4 స్కోరుతో భారత్ విజయం అందుకుంది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో భారత్ తలపడుతుంది.