ఫైనల్లో యువ భారత్‌

ABN , First Publish Date - 2023-06-01T00:26:25+05:30 IST

జూనియర్‌ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 9-1తో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది.

ఫైనల్లో యువ భారత్‌

సెమీస్‌లో కొరియాపై 9-1తో విజయం

సలా (ఒమన్‌): జూనియర్‌ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 9-1తో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది. ధామి బాబీ సింగ్‌ (31వ, 39వ, 55వ నిమిషం) హ్యాట్రిక్స్‌ గోల్స్‌తో విజృంభించగా.. లక్రా (13వ), హుందాల్‌ అర్జిత్‌ సింగ్‌ (19వ), అంగద్‌ బీర్‌ (34వ), కెప్టెన్‌ ఉత్తమ్‌ సింగ్‌ (38వ), విష్ణుకాంత్‌ సింగ్‌ (51వ), శార్దానంద్‌ (57వ) తలో గోల్‌ సాధించారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ను కియోన్‌నియోల్‌ వాంగ్‌ (46వ) చేశాడు. రెండో సెమీఫైనల్‌ మలేసియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనుంది. ఇందులో గెలిచిన విజేతతో భారత్‌ ఫైనల్‌ ఫైట్‌ను గురువారం ఆడనుంది.

Updated Date - 2023-06-01T00:26:25+05:30 IST