Yashasvi Jaiswal: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు జైస్వాల్.. రోహిత్‌తో కలిసి ఇంగ్లండ్‌కు పయనం!

ABN , First Publish Date - 2023-05-29T12:09:35+05:30 IST

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే సెంచరీ కూడా సాధించాడు

Yashasvi Jaiswal: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు జైస్వాల్.. రోహిత్‌తో కలిసి ఇంగ్లండ్‌కు పయనం!

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే సెంచరీ కూడా సాధించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో (KKRvsRR) కేవలం 13 బంతుల్లోనే జైస్వాల్ అర్ధశతకం చేశాడు. దేశవాలీ క్రికెట్‌తో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ (IPL 2023) రాణించిన జైస్వాల్ ఏకంగా టీమిండియాకు ఎంపికయ్యాడు.

21 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు (WTC Final Match) స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ముందుగా చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే జూన్ మొదటి వారంలో గైక్వాడ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాను అందుబాటులో ఉండనని రుతురాజ్ సమాచారం ఇవ్వడంతో అతడి స్థానంలో జైస్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో జైస్వాల్ ఇంగ్లండ్ పయనమయ్యాడు.

Sachin Tendulkar: శుభ్‌మన్ గిల్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి విమానంలో ఇంగ్లండ్ వెళుతుండగా తీసిన ఫొటోను జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7వ తేదీ నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ (Australia vs India) దేశాలు తలపడబోతున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఇంగ్లండ్ (England) చేరుకుని సాధనలో మునిగిపోయారు.

Updated Date - 2023-05-29T12:09:35+05:30 IST