Sachin Tendulkar: శుభ్‌మన్ గిల్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

ABN , First Publish Date - 2023-05-29T11:50:26+05:30 IST

గుజరాత్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

Sachin Tendulkar: శుభ్‌మన్ గిల్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

గుజరాత్ (GT) యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ సీజన్‌లో (IPL 2023) ఇప్పటివరకు మూడు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ (IPL 2023 Final Match) చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ సెంచరీలపై మాజీ ఆటగాళ్లందరూ ప్రశంసలు కురిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా గిల్‌ను ప్రశంసించాడు. గిల్‌ బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.

``ఈ సీజన్‌లో గిల్ బ్యాటింగ్ ప్రదర్శన మరపురానిది. అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నాడు. గిల్ బ్యాటింగ్‌లో నాకు నచ్చినది అతని ప్రశాంతత, వికెట్ల మధ్య పరిగెత్తే విధానం, పరుగుల దాహం. అతడు భవిష్యత్తులో టీమిండియాకు కూడా మరిన్ని ఉత్తమ ఇన్నింగ్స్‌లు ఆడతాడు`` అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం సచిన్ పక్కన గిల్ కూర్చుని మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: మైదానంలో కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో చూపించిన అనుష్క.. విరుష్క జోడీ సూపర్ ఫన్!

సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయాణం సాగిస్తున్నాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు గిల్, ఇటు సారా ఎవరూ స్పందించలేదు. నెటిజన్లు మాత్రం ఈ వార్తలను నమ్ముతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సచిన్, గిల్ పక్కపక్కనే కూర్చున్న ఫొటోపై తమదైన శైలిలో మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-29T11:50:26+05:30 IST