సుతీర్థ జోడీకి డబ్ల్యూటీటీ టైటిల్
ABN , First Publish Date - 2023-06-26T00:57:55+05:30 IST
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సుతీర్థ జంట సొంతం చేసుకొంది. ట్యునీషియాలో ఆదివారం జరిగిన మహిళల
న్యూఢిల్లీ: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సుతీర్థ జంట సొంతం చేసుకొంది. ట్యునీషియాలో ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ జోడీ 3-1తో జపాన్ జంట కిహార-మివ హరిమోటోపై గెలిచింది. ఈ క్రమంలో ఈ ఏడాది కంటెండర్ టైటిల్ సాధించిన తొలి భారత జంటగా నిలిచింది.