World Cup : హైదరాబాద్‌లో వరల్డ్‌కప్‌ జోష్‌

ABN , First Publish Date - 2023-09-22T03:13:31+05:30 IST

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ హైదరాబాద్‌ టూర్‌ లో అభిమానులను అలరించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం చార్మినార్‌, హుస్సేన్‌సాగర్‌ వద్దకు ట్రోఫీని తీసుకెళ్లారు.

 World Cup : హైదరాబాద్‌లో వరల్డ్‌కప్‌ జోష్‌

ఉప్పల్‌ స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ హైదరాబాద్‌ టూర్‌ లో అభిమానులను అలరించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం చార్మినార్‌, హుస్సేన్‌సాగర్‌ వద్దకు ట్రోఫీని తీసుకెళ్లారు. అనంతరం ఉప్పల్‌ స్టేడియంలో మ ధ్యాహ్నం నుంచి కొద్దిసేపు ట్రోఫీని సందర్శనకు ఉం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌సీఏ సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీ సహాయకుడు కోడె దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్టేడియంలో కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లతో పాటు సౌత్‌ స్టాండ్‌, ఈస్ట్‌ స్టాండ్‌ కనోపి (పైకప్పు) పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ‘స్టేడియంలో 14 ప్రాక్టీసు పిచ్‌లను సిద్ధం చేశాం. 39 వేల సీటింగ్‌ సామర్థ్యం గల స్టేడియంలో పది వేలకు పైగా కొత్త కుర్చీలను అమర్చుతున్నామ’ని దుర్గాప్రసాద్‌ చెప్పారు. హెచ్‌సీఏ ఎన్నికలను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేస్తామని, ఎన్నికల అధికారికి అన్ని విధాలా తమ నుంచి సహకారం అందిస్తామని అన్నారు.

Updated Date - 2023-09-22T03:13:31+05:30 IST