Williamson, Nicholls: విలియమ్సన్, నికోల్స్ ద్విశతకాలు
ABN , First Publish Date - 2023-03-19T00:42:16+05:30 IST
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ఏకంగా డబుల్ సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

కివీస్ 580/4 డిక్లేర్
లంకతో రెండో టెస్టు
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ఏకంగా డబుల్ సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాన్వే (78) అర్ధసెంచరీ చేశాడు. రజితకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నె (16 బ్యాటింగ్), జయసూరియ (4 బ్యాటింగ్) ఉన్నారు. లంక ఇంకా 554 పరుగులు వెనుకబడి ఉంది.