2nd ODI AUS vs IND : గెలిచి నిలుస్తారా?
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:40 AM
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్‌లో ఆధిపత్యం చెలాయించిన మన మహిళలు తొలి వన్డేలో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారు. దాంతో స్వదేశంలో ఆసీ్‌సతో వన్డేలలో తమ పేలవమైన రికార్డును మెరుగుపరుచుకుంటారన్న
ఆసీస్ మహిళలతో రెండో వన్డే నేడు
మ్యాచ్ మ. 1.30 నుంచి, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో..
ముంబై: ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్‌లో ఆధిపత్యం చెలాయించిన మన మహిళలు తొలి వన్డేలో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారు. దాంతో స్వదేశంలో ఆసీ్‌సతో వన్డేలలో తమ పేలవమైన రికార్డును మెరుగుపరుచుకుంటారన్న ఆశలు అడియాశలయ్యాయి. ఈనేపథ్యంలో సిరీ్‌సపై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే శనివారం జరిగే రెండో వన్డేలో టీమిండియా ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ (82), పూజా వస్త్రాకర్ (62 నాటౌట్) అదరగొట్టడంతో భారత్ 282/8 స్కోరు సాధించింది. అయితే లక్ష్యాన్ని కాపాడుకొనే క్రమంలో హర్మన్‌ప్రీత్ (3-0-32-0) సహా భారత్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఫలితం దక్కలేదు. దాంతో ఇంకా మూడు ఓవర్లకుపైగా మిగిలుండగానే కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి ఆస్ట్రేలియా విజయ తీరాలకు చేరింది. ఈ పరాజయం స్వదేశంలో టీమిండియాకు వరుసగా ఎనిమిదోది కావడం గమనార్హం. మొదటి వన్డేలో టీమిండియా ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది. పలు క్యాచ్‌లను జారవిడిచిన దరిమిలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొన్న లిచ్‌ఫీల్డ్, పెర్రీ రెండో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. పేసర్ వస్త్రాకర్‌తోపాటు సీనియర్ స్పిన్నర్ దీప్తిశర్మ (1/55)పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అలాగే ఏకైక టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపిన స్నేహ్ రాణా కూడా తేలిపోయింది. టీ20లలో అరంగేట్రం మాదిరే..కెరీర్ తొలి వన్డేలోనూ సైకా ఇషాక్ (6-0-48-0) విఫలమైంది.
రోడ్రిగ్స్, వస్త్రాకర్ ఎనిమిదో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం తప్ప..భారత బ్యాటింగ్‌లో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఓటమి నుంచి కేవలం ఒకరోజులో కోలుకొని మెరుగ్గా రాణించడమంటే భారత్‌కు సవాలే. అందులోనూ..23 రోజుల వ్యవధిలో ఏడో మ్యాచ్ లో బరిలో దిగుతున్నందున ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక..అనారోగ్యంతో మొదటి వన్డేకు దూరమైన వైస్‌కెప్టెన్, కీలక బ్యాటర్ స్మృతి మంధాన రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై స్పష్టత లేదు. ఉక్కపోత, ఎండతో మొదటి వన్డే సందర్భంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న రోడ్రిగ్స్ పరిస్థితి ఎలా ఉందనేదీ తెలియ రాలేదు.