Share News

CSK vs GT IPL final live updates: ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్..

ABN , First Publish Date - 2023-05-29T19:01:33+05:30 IST

ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ప్రస్తుత అప్‌డేట్ ఏంటంటే...

CSK vs GT IPL final live updates:  ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్..

Live News & Update

  • 2023-11-19T15:13:58+05:30

    ముగిసిన 16వ ఓవర్

    16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 101/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (34), కేఎల్ రాహుల్ (10) ఉన్నారు.

  • 2023-05-29T21:59:00+05:30

    ఐపీఎల్ ఫైనల్‌కి మళ్లీ అడ్డుపడ్డ వరుణుడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. చెన్నై ఇన్నింగ్స్ ఆరంభమై కేవలం 3 బంతులు మాత్రమే పడ్డాయి. మ్యాచ్ ముగిసే సమయానికి చెన్నై స్కోరు 4/0గా ఉంది.

    Untitled-12.jpg

  • 2023-05-29T21:50:00+05:30

    215 పరుగుల భారీ లక్ష్య చేధనకు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవోన్ కాన్వే బరిలోకి దిగారు.

  • 2023-05-29T21:21:00+05:30

    ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 214 పరుగులు చేసింది. గుజరాత్ ఇంత భారీ స్కోరు చేయడంలో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ కీలకమైంది. చెన్నై బౌలర్లు అందరినీ సుదర్శన్ ఉతికి ఆరేశాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. మైదానం అన్ని మూలలా ఈ యువ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడాడు. అయితే సెంచరీకి 4 పరుగుల దూరంలో మహీష్ పథీరన బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

    Untitled-11.jpg

  • 2023-05-29T20:46:00+05:30

    రెండవ వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా వికెట్‌ను గుజరాత్ కోల్పోయింది. పేసర్ చాహార్ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 54 పరుగులు చేసిన సాహా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

    Untitled-7.jpg

  • 2023-05-29T20:25:00+05:30

    11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 96/1గా ఉంది. ప్రస్తుతం సాయి సుదర్శన్ 18, వృద్ధిమాన్ సాహా 47 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 2023-05-29T20:20:00+05:30

    గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. చివరి 5 మ్యాచుల్లో 43, 47, 20, 19, 53 చొప్పున పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్‌లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.

  • 2023-05-29T20:12:00+05:30

    9 ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే..

    9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు: 80/1 క్రీజులో సాయి సుదర్శన్(4) వృద్ధిమాన్ సాహా (37) పరుగుల వద్ద ఉన్నారు.

  • 2023-05-29T20:05:00+05:30

    Untitled-13.jpgగుజరాత్ టైటాన్స్‌కి బిగ్ షాక్..

    శుభ్‌మన్ గిల్ (39) పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ స్టంప్ ఔట్ చేశాడు.

  • 2023-05-29T20:00:00+05:30

    ఫామ్ కొనసాగిస్తున్న గిల్...

    పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు: 62/0 6 ఓవర్లు 3 ఫోర్లుతో చెలరేగిన గిల్

  • 2023-05-29T19:50:00+05:30

    గిల్, సాహా విధ్వంసం..

    4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు: 38/0 క్రీజులో శుభ్‌మన్ గిల్ (21), వృద్ధిమాన్ సాహా (17) పరుగులతో ఉన్నారు.

  • 2023-05-29T19:15:00+05:30

    తుది జట్లు....

    గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ.

    చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవోన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మహీశ పథీరన, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ.

    Untitled-6.jpg

  • 2023-05-29T19:02:00+05:30

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్. వర్షం పడొచ్చనే అంచనాలు ఉండడంతో ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు.

  • 2023-05-29T18:58:00+05:30

    క్రికెట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. మరో అరగంటలో ఐపీఎల్2023 ఫైనల్ (IPL2023 final) మ్యాచ్ ప్రారంభమవుతుందనగా శుభవార్త అందింది. అక్కడి వాతావరణం పొడిగానే ఉంది. షెడ్యూల్‌కు అనుగుణంగా.. అంటే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.