Share News

ఆ ఘనత మేమే సాధిస్తాం

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:33 AM

దక్షిణాఫ్రికాలో భారత జట్టు టెస్టు సిరీస్‌ సాధించలేదు. అద్భుతంగా ఆడేందుకు మాకిది సువర్ణావకాశం. చివరి రెండు పర్యటనల్లో మేం విజయాలకు దగ్గరగా వచ్చినా నిరాశే ఎదురైంది.

ఆ ఘనత మేమే సాధిస్తాం

దక్షిణాఫ్రికాలో భారత జట్టు టెస్టు సిరీస్‌ సాధించలేదు. అద్భుతంగా ఆడేందుకు మాకిది సువర్ణావకాశం. చివరి రెండు పర్యటనల్లో మేం విజయాలకు దగ్గరగా వచ్చినా నిరాశే ఎదురైంది. అయినా ఈసారి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో వచ్చాం. అందుకే ఇప్పటిదాకా ఏ భారత జట్టూ సాధించని సిరీస్‌ ఘనతను మా ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాం. ఇక పిచ్‌ పరిస్థితిని బట్టి ముకేశ్‌, ప్రసిద్ధ్‌లలో ఒకరిని తీసుకుంటాం.

- రోహిత్‌

త్వరలోనే సమాధానం వస్తుంది..

వన్డే వరల్డ్‌కప్‌ ముగియడంతో రోహిత్‌ శర్మ భవిష్యత్‌ ప్రణాళికలు ఏంటి? వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచక్‌పలో ఆడతాడా? ఈ ప్రశ్నలకు సోమవారం మీడియా సమావేశంలో రోహిత్‌ స్పందిస్తూ.. ‘మీరేం అడుగుతున్నారో నాకు తెలుసు. వీటన్నింటికి త్వరలోనే మీకు సమాధానం వస్తుంది’ అని అన్నాడు.

Updated Date - Dec 26 , 2023 | 06:45 AM