ప్రణీత్‌కు వీసా సమస్య!
ABN , First Publish Date - 2023-09-20T04:36:27+05:30 IST
వీసా సమస్యల కారణంగా ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పకు తెలంగాణ పిన్నవయసు గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ ఉప్పాళ దూరమయ్యాడు. మెక్సికోలో ఈ నెల 22 నుంచి పోటీలు జరగనున్నాయి. అయితే, ప్రణీత్‌తోపాటు అరుణ్

చెన్నై: వీసా సమస్యల కారణంగా ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పకు తెలంగాణ పిన్నవయసు గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ ఉప్పాళ దూరమయ్యాడు. మెక్సికోలో ఈ నెల 22 నుంచి పోటీలు జరగనున్నాయి. అయితే, ప్రణీత్‌తోపాటు అరుణ్ కటారియా, వృశాంక్ చౌహాన్, భాగ్యశ్రీ పాటిల్, ఫిమిల్ చెల్లాదురైకు వీసా మంజూరు కాలేదు. ఈ ఐదుగురు టైటిల్ ఫేవరెట్లేనని ఫిడే అడ్వయిజరీ బోర్డు చైర్మన్ భరత్ సింగ్ చౌహాన్ చెప్పాడు. భారత బృందంలోని బొమ్మిని మౌనిక అక్షయ, అమూల్య గురుప్రసాద్, రక్షిత రవి, హర్షవర్దన్, ప్రణవ్ ఆనంద్, దుష్యంత్ శర్మ, విఘ్నే్‌షలు మెక్సికోకు వెళ్లారు. గతేడాది భారత్ తరఫున 13 మంది ఈ టోర్నీలో పాల్గొన్నారు. గతంలో విశ్వనాథన్ ఆనంద్, పెంట్యాల హరికృష్ణ, అభిజిత్ గుప్తా, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, సౌమ్య స్వామినాథన్ ఈ జూనియర్ చాంపియన్‌షి్‌ప విజేతలుగా వెలుగులోకి వచ్చారు.