UP Warriors: ముంబైకి యూపీ షాక్
ABN , First Publish Date - 2023-03-19T00:52:05+05:30 IST
స్వల్ప స్కోర్ల పోరు..అయినా మ్యాచ్ చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ.. కానీ ఒత్తిడిని అధిగమించిన యూపీ వారియర్స్‌ను వరించిన విజయం. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు షాక్.

దీప్తి, ఎకిల్‌స్టన్ ఆల్‌రౌండ్ షో
ముంబై: స్వల్ప స్కోర్ల పోరు..అయినా మ్యాచ్ చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ.. కానీ ఒత్తిడిని అధిగమించిన యూపీ వారియర్స్‌ను వరించిన విజయం. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు షాక్. శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై 20 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హేలీ మాథ్యూస్ (35), ఇసీ వాంగ్ (32), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (25) రాణించారు. స్పిన్నర్లు ఎకిల్‌స్టన్ మూడు, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తిశర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్వల్ప ఛేదనలో టాపార్డర్ విఫలమైనా..గ్రేస్ హ్యారిస్ (39), మెక్‌గ్రాత్ (38) బాధ్యతాయుతంగా ఆడారు. కీలక దశలో హ్యారిస్ అవుటైనా..దీప్తిశర్మ, ఎకిల్‌స్టన్ ఒత్తిడిని అదిమిపట్టి జట్టును గెలిపించారు. దాంతో 19.3 ఓవర్లలో 129/5తో యూపీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీప్తీశర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
సంక్షిప్తస్కోర్లు:
ముంబై ఇండియన్స్: 20 ఓవర్లలో 127 (మాథ్యూస్ 35, వాంగ్ 32, హర్మన్ 25, ఎకిల్‌స్టన్ 3/15, రాజేశ్వరి 2/16, దీప్తి 2/35)
యూపీ వారియర్స్:
19.3 ఓవర్లలో 129/5 (హ్యారిస్ 39, మెక్‌గ్రాత్ 38, ఎకిల్‌స్టన్ నాటౌట్ 16, దీప్తిశర్మ నాటౌట్ 13, కెర్ 2/22).