Virat kohli: కోహ్లీ, గిల్ సెంచరీల్లో తేడా అదే.. మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-05-23T08:52:08+05:30 IST

గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్‌) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు.

Virat kohli: కోహ్లీ, గిల్ సెంచరీల్లో తేడా అదే.. మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (GTvsRCB) ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (Virat Kohli) (61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్‌) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ తరఫున శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 నాటౌట్‌) శతకం సాధించాడు. ఫలితంగా గుజరాత్ విజయం సాధించింది.

ఒకే మ్యాచ్‌లో కోహ్లీ, గిల్ చేసిన సెంచరీల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరిలో ఎవరి సెంచరీ బెస్ట్ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ (Tom Moody) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి ఆటలో ఉన్న భిన్నత్వం గురించి మాట్లాడాడు. ``ఇద్దరూ అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. అయితే కోహ్లీ తన ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ మాత్రమే కొట్టాడు. గిల్ ఏకంగా ఎనిమిది సిక్స్‌లు కొట్టాడు. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్న హడావిడి లేకుండా చాలా కూల్‌గా ఆడాడు. అతడి బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మ్యాచ్ గుజరాత్ కంట్రోల‌‌్‌లోనే ఉన్నట్టు అనిపించింది.

Virat Kohli: కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ టీమ్.. గిల్‌ను ప్రశంసిస్తూ ``కింగ్``‌కు పరోక్షంగా చురకలు!

అంత కంట్రోల్‌గా కనిపించిన గిల్ స్ట్రైక్ రేట్ దాదాపు 200 ఉంది. టీ-20 క్రికెట్లో 10, 20 బంతులే ఎంతో ప్రభావం చూపిస్తాయి. రెండూ అద్భుతమైన శతకాలే. కాకపోతే కంపేర్ చేయాల్సి వస్తే గిల్ సెంచరీ బెస్ట్`` అని మూడీ అన్నారు. కాగా, ఈ సీజన్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడుతున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-05-23T08:52:08+05:30 IST