Virat Kohli: కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ టీమ్.. గిల్‌ను ప్రశంసిస్తూ ``కింగ్``‌కు పరోక్షంగా చురకలు!

ABN , First Publish Date - 2023-05-22T14:42:09+05:30 IST

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. దీంతో లఖ్‌నవూ టీమ్ పండగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Virat Kohli: కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ టీమ్.. గిల్‌ను ప్రశంసిస్తూ ``కింగ్``‌కు పరోక్షంగా చురకలు!

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (GTvsRCB) గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. దీంతో లఖ్‌నవూ టీమ్ (LSG) పండగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో (IPL 2023) ఒక మ్యాచ్‌లో లఖ్‌నవూ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir), ఆటగాడు నవీన్-ఉల్-హక్‌తో (Naveen-ul-Haq) కోహ్లీకి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వారిద్దరూ కోహ్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా కోహ్లీని (Virat Kohli) పరోక్షంగా ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

తాజాగా గుజరాత్ చేతిలో ఆర్సీబీ పరాజయం పాలవ్వడంతో నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఓటమిని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. ఒక వ్యక్తి పగలబడి నవ్వుతున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించడంతో నవీన్ ఇలా తన సంతోషాన్ని ఇలా పంచుకున్నాడు. ఇక, లఖ్‌నవూ టీమ్ కూడా కోహ్లీకి పరోక్షంగా చురకలంటించింది. సెంచరీ చేసి ఆర్సీబీని ఓడించిన గుజరాత్ ఆటగాడు గిల్ (Shubman Gill) ఫొటోనే షేర్ చేసి.. ``ప్రిన్స్? అతను ఇప్పటికే ``కింగ్```` అని కామెంట్ చేసింది. కోహ్లీని అభిమానులు ``కింగ్`` అని అభిమానంగా పిలుచుకుంటారు.

IPL 2023: ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే..

గిల్ నిజమైన ``కింగ్`` అని పేర్కొంటూ లఖ్‌నవూ టీమ్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. కాగా, నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ అభిమానులు మళ్లీ ట్రోలింగ్ ప్రారంభించారు. నవీన్ తన పరిమితులను అధిగమించాడని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇదే నవీన్‌కు చివరి ఐపీఎల్ అని మరొకరు స్పందించారు. నవీన్‌నే కాదు, గౌతమ్ గంభీర్‌ను, లఖ్‌నవూ టీమ్‌ను కూడా కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-22T14:42:09+05:30 IST