భారత్‌ ‘ఎ’ జట్టులో నలుగురు తెలుగు క్రికెటర్లు

ABN , First Publish Date - 2023-06-03T00:54:38+05:30 IST

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఎమర్జింగ్‌ ఉమన్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పాల్గొనే భారత్‌ ‘ఎ’ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.

భారత్‌ ‘ఎ’ జట్టులో నలుగురు తెలుగు క్రికెటర్లు

త్రిష, యశశ్రీ, మమత, అనూషకు చోటు

ఎమర్జింగ్‌ ఉమెన్‌ ఆసియా కప్‌ టీ20

న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఎమర్జింగ్‌ ఉమన్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పాల్గొనే భారత్‌ ‘ఎ’ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ శ్వేత సెహ్రావత్‌ జట్టు కెప్టెన్‌గా వ్యహరించనుంది. 14 మంది సభ్యుల బృందంలో తెలుగు క్రికెటర్లు గొంగడి త్రిష, సొప్పదండి యశశ్రీ, మమత మడివాల, బి. అనూషకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మీడియం పేసర్‌ యశశ్రీ, వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ మమత, అనంతపురానికి చెందిన బి. అనూషకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం లభించింది. ఈనెల 12 నుంచి హాంకాంగ్‌లో జరిగే టోర్నీలో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. గ్రూపు ‘ఎ’లో భారత్‌తోపాటు హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌, గ్రూపు ‘బి’లో బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేసియా, యూఏఈ జట్లు బరిలోకి దిగనున్నాయి.

భారత్‌ ‘ఎ’ జట్టు: శ్వేత సెహ్రావత్‌ (కెప్టెన్‌), సౌమ్య తివారీ (వైస్‌-కెప్టెన్‌), గొంగడి త్రిష, ముస్కాన్‌, శ్రేయాంక, కనికా, ఉమా ఛెత్రి (కీపర్‌), మమత మడివాల (కీపర్‌), టిటాస్‌, యశశ్రీ, కశ్వీ గౌతమ్‌, పర్షవీ, మన్నత్‌ కశ్యప్‌, బి.అనూష

Updated Date - 2023-06-03T00:54:51+05:30 IST