Verstappen: ఎదురులేని వెర్‌స్టాపెన్
ABN , First Publish Date - 2023-09-04T02:29:44+05:30 IST
ఫార్ములావన్ స్టార్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో రికార్డు సృష్టించాడు. వరుసగా పదోసారి ఈ టైటిల్ నెగ్గి ఇక్కడ తనకు తిరుగులేదని నిరూపించాడు.
వరుసగా పదోసారి ఇటాలియన్ గ్రాండ్ ప్రీ కైవసం
మోంజా (ఇటలీ): ఫార్ములావన్ స్టార్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో రికార్డు సృష్టించాడు. వరుసగా పదోసారి ఈ టైటిల్ నెగ్గి ఇక్కడ తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ అగ్రస్థానంతో ముగించి చాంపియన్‌గా నిలిచాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్ రెండోస్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్ మూడోస్థానంతో పోడియం ఫినిష్ చేశాడు. 25 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్‌లో 47వ విజయం.