Share News

భారత బాక్సర్ల జోరు

ABN , First Publish Date - 2023-12-03T01:56:23+05:30 IST

జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో 12మంది భారత బాక్సర్లు ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో 54 కిలోల సెమీ్‌సలో

భారత బాక్సర్ల జోరు

న్యూఢిల్లీ: జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో 12మంది భారత బాక్సర్లు ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో 54 కిలోల సెమీ్‌సలో అమీషా, 48 కిలోల్లో పాయల్‌ స్వర్ణ పోరుకు చేరుకొన్నారు. ప్రాచీ టోకాస్‌ (+80 కి), మేఘా (80 కి), విని (57 కి), ఆకాంక్ష (70 కి), శ్రుతి (63 కి), నిషా (52 కి) కూడా అదిరే విజయాలతో ఫైనల్లోకి అడుగుపెట్టారు. బాలుర విభాగంలో హార్దిక్‌ (80 కి), హేమంత్‌ (80+ కి), జతిన్‌ (54 కి), సాహిల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. కాగా, సెమీ్‌సలో ఓడిన నేహా (46 కి), పరి (50 కి), క్రితిక (75 కి), సికందర్‌ (48 కి) కాంస్యాలతో వెనుదిరిగారు.

Updated Date - 2023-12-03T01:56:24+05:30 IST