ఫైనల్ బెర్తే లక్ష్యంగా..
ABN , First Publish Date - 2023-05-12T03:58:48+05:30 IST
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మూడు కాంస్య పతకాలను ఖరారు చేసుకొన్న భారత్.. దానిని మరింత మెరుగుపరుచుకోవాలన్న పట్టుదలగా ఉంది.
తాష్కెంట్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మూడు కాంస్య పతకాలను ఖరారు చేసుకొన్న భారత్.. దానిని మరింత మెరుగుపరుచుకోవాలన్న పట్టుదలగా ఉంది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే సెమీఫైనల్ బౌట్లలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ (57 కి.), దీపక్ భోరియా (51 కి.), నిశాంత్ దేవ్ (71 కి.) తలపడనున్నారు. అయితే వీళ్లు ఎదుర్కొనే ప్రత్యర్థులు ముగ్గురూ కఠినమైన వారు కావడం గమనార్హం. సైదల్ హోర్తా (క్యూబా)తో హుస్సాముద్దీన్, బిలాల బెన్నమా (ఫ్రాన్స్)తో దీపక్, అస్లాన్‌బెక్ (కజకిస్థాన్)తో నిశాంత్ తలపడనున్నారు.