పట్టుబిగించిన ఆసీస్
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:49 AM
మిచెల్ మార్ష్ (96), స్మిత్ (50) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ పట్టుబిగించింది. 16/4తో కష్టాల్లో పడిన తరుణంలో మార్ష్, స్మిత్ ఐదో వికెట్‌కు 153
ఆదుకొన్న మార్ష్, స్మిత్
ఆసీస్ ఆధిక్యం 241
పాక్ 264 ఆలౌట్
మెల్‌బోర్న్: మిచెల్ మార్ష్ (96), స్మిత్ (50) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ పట్టుబిగించింది. 16/4తో కష్టాల్లో పడిన తరుణంలో మార్ష్, స్మిత్ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించడంతో.. గురువారం ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 187/6 స్కోరు చేసింది. దీంతో ఆసీస్ ఆధిక్యం 241 పరుగులకు చేరుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 194/6 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాక్ 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 318 రన్స్ చేసింది.