అందుకే స్వర్ణం చేజారింది!
ABN , First Publish Date - 2023-10-27T02:28:15+05:30 IST
దుస్తుల సమస్య కారణంగా ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప్స 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత జూనియర్ జట్టు ‘రికార్డు’ స్వర్ణం కోల్పోయింది!...
న్యూఢిల్లీ: దుస్తుల సమస్య కారణంగా ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప్స 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత జూనియర్ జట్టు ‘రికార్డు’ స్వర్ణం కోల్పోయింది! కొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న ఈ పోటీలలో ఉమామహేశ్ మద్దినేని, ధనుష్ శ్రీకాంత్, అభినవ్ షాతో కూడిన భారత జట్టు 1882 పాయింట్లు స్కోరు చేసింది. వాస్తవంగా ఈ జూనియర్ ఆసియా రికార్డు స్కోరుతో మన జట్టుకు స్వర్ణ పతకం లభించేది. కానీ ధనుష్ శ్రీకాంత్ నిర్ణీత ప్రమాణాలతో కూడిన ‘ట్రౌజర్’ ధరించలేదంటూ నిర్వాహకులు అతడిని డిస్‌క్వాలిఫై చేశారు. ఫలితంగా భారత జట్టు పసిడి పతకం చేజార్చుకుంది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నిబంధనల మేరకు పోటీలలో షూటర్ వేసుకొనే ట్రౌజర్ మందం 3.0. కంటే తక్కువ ఉండకూడదు. కానీ ధనుష్ ధరించిన ట్రౌజర్ మందం 2.9 ఉండడంతో అతడిపై అనర్హత వేటు వేశారు.