Share News

ఖాతా తెరవని తెలుగు టైటాన్స్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:34 AM

ప్రొ కబడ్డీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం టైటాన్స్‌ 40-51 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

ఖాతా తెరవని తెలుగు టైటాన్స్‌

పుణె: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం టైటాన్స్‌ 40-51 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ అన్నింట్లోనూ ఓడిపోవడం గమనార్హం. అషు మాలిక్‌ 16 పాయింట్లతో ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌ 49-19తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది.

Updated Date - Dec 17 , 2023 | 06:58 AM