T20 series with Kiwis : మరో ధనాధన్‌

ABN , First Publish Date - 2023-01-27T03:27:31+05:30 IST

యువ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టు మరో సిరీ్‌సకు సిద్ధమవుతోంది. శ్రీలంకతో 2-1తో సిరీస్‌ దక్కించుకున్న ఊపులో... నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను కూడా దున్నేయాలనుకుంటోంది.

T20 series with Kiwis : మరో ధనాధన్‌

నేటి నుంచి కివీస్‌తో టీ20 సిరీస్‌

జోష్‌లో టీమిండియా

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

రాంచీ: యువ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టు మరో సిరీ్‌సకు సిద్ధమవుతోంది. శ్రీలంకతో 2-1తో సిరీస్‌ దక్కించుకున్న ఊపులో... నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను కూడా దున్నేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌కు రాంచీ వేదిక కానుంది. రోహిత్‌ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే కివీస్‌ను క్లీన్‌స్వీ్‌ప చేసిన విషయం తెలిసిందే. దీంతో కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా రాణించాలనుకుంటోంది. ఎప్పటిలాగే ఈ సిరీ్‌సకు కూడా రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌, షమి, సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చారు. టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం హార్దిక్‌ కెప్టెన్సీలో జట్టుకిది వరుసగా మూడో టీ20 సిరీస్‌ కావడం విశేషం. అలాగే మిచెల్‌ శాంట్నర్‌ నేతృత్వంలోని కివీస్‌ జట్టు ఆడిన గత 10 టీ20ల్లో ఎనిమిది గెలిచింది. అయితే ఇవన్నీ ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌లాంటి చిన్నజట్లపై సాధించినవే.

ఓపెనర్‌గా గిల్‌!

డాషింగ్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఏడాది తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నా బరిలోకి దిగేది కష్టమే. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌నే ఈ ఫార్మాట్‌లోనూ ఓపెనర్‌గా పంపే అవకాశముంది. ఇక మరో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ ఖాయమే. అలాగే వన్డేల్లో రాణించలేకపోయిన సూర్య పొట్టి ఫార్మాట్‌లో మాత్రం అత్యంత ప్రమాదకర ఆటగాడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. కానీ బౌలింగ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ లంకపై ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. యువ పేసర్‌ శివమ్‌ మావి మాత్రం అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లతో అబ్బురపరిచాడు. ఉమ్రాన్‌తో కలిసి ఈ సిరీ్‌సలోనూ చెలరేగాలనుకుంటున్నాడు. ఇక స్పిన్నర్లలో కుల్దీప్‌కు కాకుండా చాహల్‌కే చాన్స్‌ దక్కవచ్చు.

మరోవైపు వన్డే సిరీ్‌సలో వైట్‌వా్‌షకు గురైన కివీస్‌ దాదాపుగా అదే జట్టుతో బరిలోకి దిగబోతోంది. అయితే కెప్టెన్‌గా శాంట్నర్‌ వ్యవహరిస్తాడు. విలియమ్సన్‌, సౌథీ లేని జట్టు ధనాధన్‌ ఆటతీరును చూపడంలో ఏమేరకు సఫలమవుతుందనే ఆసక్తి నెలకొంది. బౌలింగ్‌లో ఫెర్గూసన్‌తో పాటు గాయంనుంచి కోలుకున్న సోధీలపై జట్టుఆధారపడి ఉంది.

పిచ్‌: ఈ మైదానంలో జరిగిన 3అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ నెగ్గింది. ఇక్కడ చేజింగ్‌ జట్లకు విజయావకాశాలు ఎక్కువ. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ వైపు మొగ్గుచూపవచ్చు.

సిరీ్‌సకు రుతురాజ్‌ దూరం

కివీ్‌సతో టీ20 సిరీ్‌సకు ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ మణికట్టుకు గాయమైంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌, ఇషాన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), హుడా, సుందర్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌/కుల్దీప్‌.

న్యూజిలాండ్‌: ఆలెన్‌, కాన్వే, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), టిక్‌నెర్‌, సోధీ, లిస్టర్‌, ఫెర్గూసన్‌.

Updated Date - 2023-01-27T06:33:13+05:30 IST