French Open : స్వియటెక్‌, రిబకినా ముందంజ

ABN , First Publish Date - 2023-06-02T03:53:34+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌, నాలుగో సీడ్‌ ఎలెనా రిబకినా, కాస్పర్‌ రూడ్‌ మూడో రౌండ్‌కు చేరుకొన్నారు.

 French Open : స్వియటెక్‌, రిబకినా ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌, నాలుగో సీడ్‌ ఎలెనా రిబకినా, కాస్పర్‌ రూడ్‌ మూడో రౌండ్‌కు చేరుకొన్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ స్వియటెక్‌ 6-4 6-0తో క్లైరి ల్యూ (అమెరికా)పై, కజకిస్థాన్‌ క్రీడాకారిణి రిబకినా 6-3, 6-3తో నొస్కొవా (చెక్‌)పై, బీట్రిజ్‌ (బ్రెజిల్‌)... షనైడర్‌పై, ఎకటరీనా 6-2, 6-0తో అన్నా లెనా (జర్మనీ)పై గెలిచారు. మాడిసన్‌ కీస్‌ 2-6, 6-4, 4-6తో కైలా డే చేతిలో, 22వ సీడ్‌ డోనా వికిక్‌ (క్రొయేషియా) 6-3, 4-6, 3-6తో పెరా (అమెరికా) చేతిలో ఓడారు. నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 6-3, 6-2, 4-6, 7-5తో జఫేరి (ఇటలీ)పై, క్రొయేషియా ఆటగాడు కోరిక్‌ 6-3, 4-6, 4-6, 6-3, 6-4తో కచిన్‌ (అర్జెంటీనా)పై, నిషియోక (జపాన్‌).. మ్యాక్స్‌ పర్సెల్‌ (ఆస్ట్రేలియా)పై, దిమిత్రోవ్‌ (బెలారస్‌)...రుసోరి (ఫిన్లాండ్‌)పై నెగ్గారు. కాగా, సిన్నర్‌ 7-6(0), 6-7(7), 6-1, 6-7(4), 5-7తో ఆల్ట్‌మెర్‌ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. ఫ్రాన్స్‌ ఆటగాడు గేల్‌ మోన్‌ఫిల్స్‌ మణికట్టు గాయం కారణంగా ప్రత్యర్థి, ఆరో సీడ్‌ హోల్గర్‌ రూన్‌కు వాకోవర్‌ ఇచ్చాడు.

Updated Date - 2023-06-02T05:00:54+05:30 IST