Share News

IPL 2024 Retention: కీలక ఆటగాళ్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ABN , First Publish Date - 2023-11-26T17:39:22+05:30 IST

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు, విడిచి పెట్టిన ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. అందరూ ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యారీ బ్రూక్‌ను విడుదల చేసింది.

IPL 2024 Retention: కీలక ఆటగాళ్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు, విడిచి పెట్టిన ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. అందరూ ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యారీ బ్రూక్‌ను విడుదల చేసింది. బ్రూక్‌‌తోపాటు సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రంత్ శర్మ, అకెల్ హోసెన్, అదిల్ రషీద్‌ను విడుదల చేసింది. ఇక అబ్దుల్ సమద్, మార్క్రమ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేందర్ సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి), అభిషేక్ శర్మ, మార్కో యెన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మాయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్‌హక్ ఫరూఖీలను రిటెయిన్ చేసుకున్నట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. కీలకమైన ఆటగాళ్లను విడుదల చేయడం తమ ఖాతాలో రూ.34 కోట్ులగా ఉందని సన్‌రైజర్స్ ప్రకటించింది.


కాగా హ్యారీ బ్రూక్‌ను సన్ రైజర్స్ వేలంలో ఏకంగా రూ.13.25 కోట్లు వెచ్చింది దక్కించుకుంది. కానీ గతేడాది సీజన్‌లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. కొన్ని మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితం చేయాల్సిన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా సన్‌రైజర్స్ యాజమాన్యం అతడిని విడుదల చేసింది.

Updated Date - 2023-11-26T17:46:04+05:30 IST