Share News

సురేఖకు రజతం

ABN , First Publish Date - 2023-12-11T04:51:00+05:30 IST

ఇండోర్‌ వరల్డ్‌ ఆర్చరీ సిరీస్‌ తైపీ ఓపెన్‌లో భారత స్టార్‌ కాంపౌండ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ రజతంతో మెరిసింది...

సురేఖకు రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇండోర్‌ వరల్డ్‌ ఆర్చరీ సిరీస్‌ తైపీ ఓపెన్‌లో భారత స్టార్‌ కాంపౌండ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ రజతంతో మెరిసింది. ఆదివారం చైనీస్‌ తైపీలో జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో సురేఖ ఒక్క పాయింట్‌ తేడాతో స్వర్ణం కోల్పోయింది. ఈ విజయవాడ ఆర్చర్‌ ఫైనల్లో 145-146తో భారత్‌కే చెందిన పర్నీత్‌ కౌర్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. చైనీస్‌ తైపీకి చెందిన ఆర్చర్‌ చెన్‌ యి సున్‌ కాంస్యం పతకం దక్కించుకుంది.

Updated Date - 2023-12-11T04:51:03+05:30 IST