షూటర్ నిశ్చల్‌కు రజతం
ABN , First Publish Date - 2023-09-20T04:42:22+05:30 IST
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ పతకంతో మెరిసింది. బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో సోమవారం జరిగిన మహిళల 50 మీటర్ల

రియో వరల్డ్ కప్
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ పతకంతో మెరిసింది. బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో సోమవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో నిశ్చల్ రజతం సాధించింది. ఫైనల్స్‌లో నిశ్చల్ 458 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. నార్వే షూటర్ జెనెట్టె హెగ్ స్వర్ణం గెలిచింది. స్టెఫానీ గ్రౌండ్‌సీ (డెన్మార్క్) కాంస్యం అందుకుంది. హరియాణాకు చెందిన నిశ్చల్ సీనియర్ స్థాయిలో తాను పోటీపడ్డ తొలి ప్రపంచ కప్‌లోనే పతకం నెగ్గడం విశేషం.