Share News

శీతల్‌.. నచ్చిన కారు తీసుకో

ABN , First Publish Date - 2023-10-30T02:23:02+05:30 IST

ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ముందుంటారు. ఇప్పటికే అనేకమంది క్రీడాకారులకు ఆయన ఎన్నో బహుమతులు...

శీతల్‌.. నచ్చిన కారు తీసుకో

పారా ఆర్చర్‌కు ఆనంద్‌ మహీంద్రా ఆఫర్‌

న్యూఢిల్లీ: ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ముందుంటారు. ఇప్పటికే అనేకమంది క్రీడాకారులకు ఆయన ఎన్నో బహుమతులు అందజేశారు కూడా. తాజాగా చైనాలో ముగిసిన పారా ఆసియా క్రీడల్లో రెండు పతకాలతో సత్తా చాటిన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవికి ఆయన ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఆమెకిష్టమైన కారును తమ సంస్థ అందజేస్తుందన్న ఆనంద్‌.. ఆమె అవసరాలకు అనుగుణంగా ఆ కారును తయారు చేసి ఇస్తామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఇకనుంచి నా జీవితంలో చిన్న చిన్న సమస్యల గురించి ఫిర్యాదు చేయను. నీవు మా అందరికీ టీచర్‌. దయచేసి మా సంస్థ తయారు చేసే ఏ కారునైనా నీవు ఎంచుకోవచ్చు. నీ అవసరాలకు తగ్గట్టుగా ఆ కారును తీర్చిదిద్ది ఇస్తాం’ అని ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల శీతల్‌.. రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలను సంధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-10-30T02:23:20+05:30 IST