‘స్విస్‌’ ఫైనల్లో సాత్విక్‌ జోడీ

ABN , First Publish Date - 2023-03-26T01:40:48+05:30 IST

స్విస్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఫైనల్‌కు చేరుకొంది. శనివారం జరిగిన సెమీ్‌సలో రెండో సీడ్‌ తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి 21-19, 17-21, 21-17తో మలేసియాకు..

‘స్విస్‌’ ఫైనల్లో సాత్విక్‌ జోడీ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌లో సాత్విక్‌ జోడీ ఫైనల్‌కు చేరుకొంది. శనివారం జరిగిన సెమీ్‌సలో రెండో సీడ్‌ తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి 21-19, 17-21, 21-17తో మలేసియాకు చెందిన యోంగ్‌ యు-టొయిపై గెలిచింది. తొలి గేమ్‌లో సాత్విక్‌ జంట 16-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. పట్టువదలని మలేసియా ద్వయం 19-19తో సమం చేసింది. కానీ, చివర్లో వరుసగా 2 పాయింట్లు సాధించిన భారత షట్లర్లు గేమ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే, మలేసియా జోడీ రెండో గేమ్‌ను 21-17తో నెగ్గింది. ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా.. సాత్విక్‌-చిరాగ్‌ అద్భుతంగా ఆడి 21-17తో మ్యాచ్‌ను నెగ్గారు. ఆదివారం జరిగే తుది పోరులో చైనాకు చెందిన జియాంగ్‌- క్వియాంగ్‌తో సాత్విక్‌ జోడీ తలపడనుంది.

Updated Date - 2023-03-26T01:40:48+05:30 IST