శరత్, సాథియాన్, మనికా ‘రిటైన్’
ABN , First Publish Date - 2023-05-26T04:37:25+05:30 IST
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ నాలుగో సీజన్‌కు ముందు కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ క్రీడాకారులను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి.

అల్టిమేట్ టీటీ లీగ్
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ నాలుగో సీజన్‌కు ముందు కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ క్రీడాకారులను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. వీరిలో టాప్ ప్యాడ్లర్లు శరత్ కమల్, సాథియాన్, మనికా బాత్రా ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై లయన్స్ శరత్‌ను, గత సీజన్ ఫైనలిస్టు దబాంగ్ ఢిల్లీ సాథియాన్‌ను, బెంగళూరు స్మాషర్స్ మనికాను రిటైన్ చేసుకున్నాయి. నాలుగో సీజన్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ వచ్చేనెలలో జరగనుంది. ఈ సీజన్ లీగ్ జూలై 13 నుంచి 30 వరకు పుణెలో జరగనుంది.