Sania Mirza: సానియామిర్జా సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-13T22:14:18+05:30 IST

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Sania Mirza: సానియామిర్జా సంచలన నిర్ణయం
Sania Mirza

హైదరాబాద్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ((Sania Mirza)) సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 16 నుంచి జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) తనకు చివరి గ్రాండ్‌స్లామ్‌ అంటూ సానియా ట్వీట్‌ చేశారు. 30 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌, 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌ను వదిలేయడం బాధగా ఉందంటూ సానియా ట్విటర్‌లో తెలిపారు.

కొంతకాలం క్రితం సానియా మీర్జా, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (shoaib malik) విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు దుమారం రేపాయి. ఇటీవలే.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి తమ కొడుకు ఇజ్హాన్ పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా జరిపారు. అయితే.. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సానియాను మోసం చేశాడనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో గుప్పుమన్నాయి. షోయబ్ ఓ షో షూటింగ్‌లో ఉండగా ఈ వార్తలు దావానలంలా వ్యాపించాయి.

Updated Date - 2023-01-13T22:18:11+05:30 IST