ఆసియా గేమ్స్‌కు సైనా దూరం
ABN , First Publish Date - 2023-05-02T02:00:32+05:30 IST
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూరం కానుం ది.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూరం కానుం ది. ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడమీలో జరిగే ట్రయల్స్‌కు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆమె దూరం కానుందని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) పేర్కొంది. ఇందులో నుంచే ఆసియా గేమ్స్ కోసం జట్లను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్జౌలో ఆసియా గేమ్స్ జరుగుతాయి. ‘సైనాకు ఫిట్‌నెస్ సమస్యలున్నాయి. సైనాతో పాటు పరుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్–ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్‌లో పాల్గొనడం లేదు’ అని బాయ్ కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపాడు. ఇక గత నెల 18 వరకు తమ విభాగాల్లో టాప్–20 ర్యాంకింగ్స్‌లో ఉన్న సింధు, ప్రణయ్, చిరాగ్–సాత్విక్, ట్రీసా జాలీ–గాయత్రిలను ఇదివరకే నేరుగా ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేశారు.