నేడు రుతురాజ్‌ వివాహం

ABN , First Publish Date - 2023-06-03T01:00:55+05:30 IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శనివారం తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను వివాహమాడనున్నాడు.

నేడు రుతురాజ్‌ వివాహం

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శనివారం తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను వివాహమాడనున్నాడు. గురువారం ఈ జంట మెహిందీ వేడుకలు ఘనంగా జరిగాయి. 21 ఏళ్ల ఉత్కర్ష కూడా క్రికెటర్‌ కావడం విశేషం. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర మహిళల జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ప్రాతినిధ్యం వహించింది. అయితే చివరిసారిగా ఆమె ఏడాదిన్నర క్రితం బరిలోకి దిగింది. మరోవైపు ఈ వివాహ వేడుకలకు ఎంఎస్‌ ధోనీ హాజరయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-03T01:00:55+05:30 IST