Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. గిల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆ టైటిల్ మాదే.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-05-27T11:58:26+05:30 IST

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం ముగిసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి గుజరాత్‌కు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించాడు.

Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. గిల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆ టైటిల్ మాదే.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2023లో (IPL 2023) ముంబై ఇండియన్స్ (MI) ప్రస్థానం ముగిసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (GTvsMI) 62 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి గుజరాత్‌కు బ్యాటింగ్ అప్పగించిన రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ మూల్యం చెల్లించాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 233 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) (60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129) ఈ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (Surya Kumar Yadav) (38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61), తిలక్‌ వర్మ (14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), గ్రీన్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. ``ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ అద్భుతం. అతనిలా మా టీమ్‌లో ఒకరు బ్యాటింగ్ చేసి ఉన్నా ఫలితం మరోలా ఉండేది. గుజరాత్ గెలుపు క్రెడిట్ అంతా గిల్‌దే. అతడు అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు మూడు ఛాన్సులు.. మూడో సెంచరీ కొట్టేశాడు.. ఫీల్డర్లపై రోహిత్ అసహనం!

గిల్ తరహాలో బ్యాటర్లు అందరూ రాణిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final Match) కచ్చితంగా గెలుస్తాం. ఇక, ఈ మ్యాచ్‌లో మా స్థాయికి తగినట్టుగా ఆడలేదు. బౌలింగ్ అదనంగా 30-35 పరుగులు ఇచ్చాం. బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. గుజరాత్ అన్ని విభాగాల్లోనూ మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింద``ని రోహిత్ అన్నాడు.

Updated Date - 2023-05-27T11:58:26+05:30 IST