టాప్‌-20లో రిచా ఘోష్‌

ABN , First Publish Date - 2023-02-23T07:47:05+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో నిలకడగా రాణిస్తున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ టాప్‌

టాప్‌-20లో రిచా ఘోష్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌క్‌పలో నిలకడగా రాణిస్తున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ టాప్‌-20లో నిలిచింది. బుధవారం తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల విభాగంలో రిచా 20వ స్థానం సాధించగా.. స్మృతి మంధాన మూడో ర్యాంకులో కొనసాగుతోంది. షఫాలీ 10వ ర్యాంక్‌లో ఉండగా.. జెమీమా ఓ మెట్టెక్కి 12వ స్థానంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్‌ 13వ ర్యాంక్‌కు పడిపోయింది. బౌలర్ల కేటగిరీలో దీప్తి, రేణుక 4,5 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.

Updated Date - 2023-02-23T07:47:06+05:30 IST