Rudransh: రుద్రాంశ్‌కు రికార్డు స్వర్ణం

ABN , First Publish Date - 2023-07-11T00:08:07+05:30 IST

వరల్డ్‌ షూటింగ్‌ పారా స్పోర్ట్స్‌ (డబ్ల్యూఎ్‌సపీఎస్‌) ప్రపంచ కప్‌లో భారత ఆటగాడు రుద్రాంశ్‌ ఖండేల్‌వాల్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు.

 Rudransh: రుద్రాంశ్‌కు రికార్డు స్వర్ణం

ఓసిజెక్‌ (క్రొయేషియా): వరల్డ్‌ షూటింగ్‌ పారా స్పోర్ట్స్‌ (డబ్ల్యూఎ్‌సపీఎస్‌) ప్రపంచ కప్‌లో భారత ఆటగాడు రుద్రాంశ్‌ ఖండేల్‌వాల్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. సోమవారం జరిగిన పీ4 మిక్స్‌డ్‌ 50 మీ. పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 కేటగిరీ ఫైనల్లో 16 ఏళ్ల ఖండేల్‌వాల్‌ 231.1 పాయింట్ల రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మనీష్‌ నర్వాల్‌ రికార్డును రుద్రాంశ్‌ అధిగమించాడు. కాగా, ఇదే కేటగిరీలో మరో భారత షూటర్‌ నిహాల్‌ సింగ్‌ 222.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకొన్నాడు.

Updated Date - 2023-07-11T00:08:07+05:30 IST