Ravindra Jadeja: చెన్నైను గెలిపించిన జడేజా.. ధోనీ ఎలా ఎత్తుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-05-30T11:36:42+05:30 IST

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-16లో అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి టైటిల్ అందుకుంది.

Ravindra Jadeja: చెన్నైను గెలిపించిన జడేజా.. ధోనీ ఎలా ఎత్తుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ ఐపీఎల్-16లో (IPL 2023) అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను (GTvsCSK) 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి టైటిల్ అందుకుంది. వర్షం కారణంగా చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. చెన్నై టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ తమ వంతు సహకారం అందించారు. కాన్వే (47), రుతురాజ్ (26), రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్) మెరుపులు మెరిపించారు (IPL 2023 Final Match).

విజయం కోసం చివరి ఓవర్లో చెన్నై జట్టుకు 13 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులకు మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ దశలో చెలరేగిన జడేజా (Ravindra Jadeja) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకు మరపురాని విజయాన్ని అందించాడు. చెన్నై టీమ్‌ను, అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉండే ధోనీ ఈ మ్యాచ్ చివరి ఓవర్లో కాస్త ఎమోషనల్‌గా కనిపించాడు.

Trolls On BCCI: పిచ్‌ను పొడిగా మార్చడానికి ఈ స్పాంజ్‌లు వాడటం ఏంటో, హెయిర్ డ్రయర్‌లేంటో..!

జడేజా చివరి రెండు బంతులు ఆడుతున్నప్పుడు డగౌట్‌లో ధోనీ కళ్లు మూసుకుని ఉండిపోయాడు. చెన్నై విజయం సాధించిన తర్వాత ధోనీ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. చివరి రెండు బంతులుకు పది పరుగులు చేసి విజయం అందించిన జడేజాను ధోనీ పైకి ఎత్తేశాడు (Dhoni lifts Jadeja). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Updated Date - 2023-05-30T11:36:42+05:30 IST