Trolls On BCCI: పిచ్‌ను పొడిగా మార్చడానికి ఈ స్పాంజ్‌లు వాడటం ఏంటో, హెయిర్ డ్రయర్‌లేంటో..!

ABN , First Publish Date - 2023-05-30T10:12:06+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే తీరు మాత్రం అత్యంత పేలవం.

Trolls On BCCI: పిచ్‌ను పొడిగా మార్చడానికి ఈ స్పాంజ్‌లు వాడటం ఏంటో, హెయిర్ డ్రయర్‌లేంటో..!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI).. ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం (Narendra Modi Stadium). అయితే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే తీరు మాత్రం అత్యంత పేలవం. ఐపీఎల్-16 ఫైనల్ (IPL 2023 Final Match) మ్యాచ్‌కు వేదికగా నిర్ణయించిన నరేంద్ర మోదీ స్టేడియంలో వర్షం (Rain) పడిన తర్వాత పరిస్థితులు చూస్తే మాత్రం గల్లీ క్రికెట్‌ను తలపించాయి. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత కాసేపు వర్షం పడింది.

ఆ కాసేపు వర్షానికి పిచ్ తడిసి ముద్దయింది. దాన్ని ఆరబెట్టడానికి స్టేడియం సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. స్పాంజ్‌లతో పిచ్ ఉపరితలాన్ని శుభ్రం చేశారు (Groundmen Use Sponge To Dry Pitch). బీసీసీఐ తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ (Trolling on BCCI) చేస్తున్నారు. సామాన్యులే కాదు.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah)‌ను ట్రోల్ చేశారు.

MS Dhoni: రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం.. కన్నీళ్లు ఆగడం లేదు.. ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇస్తా అంటూ ధోనీ ఎమోషనల్!

``లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో వర్షం పడితే హోవర్ మిషన్ ద్వారా క్షణాల్లో పిచ్‌ను సిద్ధం చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీ ఇది. జైషా నేతృత్వంలోని బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం ఏడు రెట్లు ఎక్కువ. సౌకర్యాలు మాత్రం ఇలాగే ఉంటాయి`` అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. క్రికెట్ ప్రేక్షకులు కూడా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2023-05-30T10:15:39+05:30 IST