‘టాప్‌’ లేపారు

ABN , First Publish Date - 2023-04-30T02:14:51+05:30 IST

సమష్టిగా అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఇటీవల అహ్మదాబాద్‌లో రింకూ ఐదు సిక్స్‌ల విధ్వంసంతో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకొంది.

‘టాప్‌’ లేపారు

ప్లేఆఫ్స్‌ చేరువలో గుజరాత్‌ శంకర్‌, మిల్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఏడు వికెట్లతో కోల్‌కతా చిత్తు శంకర్‌

కోల్‌కతా: సమష్టిగా అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఇటీవల అహ్మదాబాద్‌లో రింకూ ఐదు సిక్స్‌ల విధ్వంసంతో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకొంది. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుచేసి టాప్‌నకు చేరుకొంది. 12 పాయింట్లతో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు చేరువకాగా.. ఆరో ఓటమితో కోల్‌కతా నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకొంది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 179/7 స్కోరు చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్‌ స్థానంలో వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టగా.. రస్సెల్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) టచ్‌లోకి వచ్చాడు. షమి 3 వికెట్లు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లిటిల్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో కోల్‌కతా 17.5 ఓవర్లలో 180/3 స్కోరు చేసి గెలిచింది. విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 నాటౌట్‌), మిల్లర్‌ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 39 బంతుల్లో 87 పరుగులు జోడించి టైటాన్స్‌ను అలవోకగా గెలిపించారు. చివరి 5 ఓవర్లలో 51 రన్స్‌ అవరమవగా.. వీరిద్దరూ మెరుపు వేగంతో ఆడి 13 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్‌ సాహా (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. గిల్‌ (49), హార్దిక్‌ పాండ్యా (26) రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఆదుకొన్నారు.

గుర్బాజ్‌ ఒక్కడే..: ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ అదిరే ఆరంభాన్నిచ్చినా బౌలర్లు భారీస్కోరు చేయకుండా కోల్‌కతాను అడ్డుకొన్నారు. షమి దెబ్బకు పవర్‌ప్లేలోనే ఓపెనర్‌ జగదీశన్‌ (19), శార్దూల్‌ (0) వికెట్లను రైడర్స్‌ చేజార్చుకొంది. అయితే, వెంకటేష్‌ అయ్యర్‌ (11)తో కలసి మూడో వికెట్‌కు 37 రన్స్‌ జోడించిన గుర్బాజ్‌.. రింకూ సింగ్‌ (19) కలసి ఐదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. 11వ ఓవర్‌లో అయ్యర్‌, కెప్టెన్‌ నితీశ్‌ రాణా (4)ను అవుట్‌ చేసిన లిటిల్‌ నైట్‌రైడర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఆ తర్వాత నూర్‌ బౌలింగ్‌లో రషీద్‌ చక్కటి క్యాచ్‌తో గుర్బాజ్‌ పోరాటం ముగిసింది. అయితే, డెత్‌ ఓవర్లలో పవర్‌ హిట్టర్లు రింకూ, రస్సెల్‌ క్రీజులో ఉన్నా జట్టుకు ఆశించినంత స్కోరు అందించలేకపోయారు.

స్కోరు బోర్డు

కోల్‌కతా: జగదీశన్‌ (ఎల్బీ) షమి 19, రహ్మనుల్లా గుర్బాజ్‌ (సి) రషీద్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 81, శార్దూల్‌ (సి) మోహిత్‌ (బి) షమి 0, వెంకటేశ్‌ అయ్యర్‌ (ఎల్బీ) లిటిల్‌ 11, నితీశ్‌ రానా (సి) తెవాటియా (బి) లిటిల్‌ 4, రింకూ సింగ్‌ (సి) లిటిల్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 19, రస్సెల్‌ (సి) తెవాటియా (బి) షమి 34, డేవిడ్‌ వీస్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 179/7; వికెట్ల పతనం: 1–23, 2–47, 3–84, 4–88, 5–135, 6–156, 7–179; బౌలింగ్‌: షమి 4–0–33–3, హార్దిక్‌ 3–0–34–0, రషీద్‌ 4–0–54–0, జోష్‌ లిటిల్‌ 4–0–25–2, నూర్‌ అహ్మద్‌ 4–0–21–2, మోహిత్‌ శర్మ 1–0–12–0.

గుజరాత్‌: సాహా (సి) హర్షిత్‌ (బి) రస్సెల్‌ 10, గిల్‌ (సి) రస్సెల్‌ (బి) నరైన్‌ 49, హార్దిక్‌ (ఎల్బీ) హర్షిత్‌ 26, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 51, మిల్లర్‌ (నాటౌట్‌) 32, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 17.5 ఓవర్లలో 180/3; వికెట్ల పతనం: 1–41, 2–91, 3–93; బౌలింగ్‌: హర్షిత్‌ 3–0–25–1, రస్సెల్‌ 3–0–29–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–42–0, సుయాశ్‌ శర్మ 4–0–37–0, నరైన్‌ 3–0–24–1, నితీశ్‌ రానా 0.5–0–14–0.

Updated Date - 2023-04-30T02:14:51+05:30 IST