రాహుల్, ఉనాద్కట్ అవుట్
ABN , First Publish Date - 2023-05-04T03:34:15+05:30 IST
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతనితో పాటు లఖ్‌నవూ పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కూడా...
● ఐపీఎల్ పూర్తి సీజన్‌కు దూరం
న్యూఢిల్లీ: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతనితో పాటు లఖ్‌నవూ పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కూడా లీగ్ నుంచి వైదొలిగాడు. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కనీసం నడవలేకపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. అలాగే ఆదివారం జట్టు నెట్‌ప్రాక్టీస్ సందర్భంగా భుజం గాయానికి గురైన ఉనాద్కట్‌ను కూడా వైద్యులు పరీక్షించనున్నారు. కాగా రాహుల్, ఉనాద్కట్ జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అందుబాటులో ఉండేది కూడా సందేహంగా మారింది.