జడేజాకు ప్రమోషన్‌

ABN , First Publish Date - 2023-03-27T03:39:53+05:30 IST

ప్రస్తుత సీజన్‌ (2022-23)కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. వరుసగా విఫలమవుతున్న బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను

జడేజాకు ప్రమోషన్‌

బి గ్రేడ్‌కు కేఎల్‌ రాహుల్‌

కేఎస్‌ భరత్‌కు చోటు జూ బీసీసీఐ కాంట్రాక్టు

న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌ (2022-23)కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. వరుసగా విఫలమవుతున్న బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను గ్రేడ్‌ ‘ఎ’ నుంచి ‘బి’కి డిమోట్‌ చేసింది. ఇక ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ము రేపుతున్న జడేజాను గ్రేడ్‌ ‘ఎ’ నుంచి ‘ఎ’+కు ప్రమోట్‌ చేసింది. రహానె, భువనేశ్వర్‌ కాంట్రాక్టు కోల్పోయారు. తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ తొలిసారి జాబితాలో చోటు దక్కించుకోగా..విహారి స్థానం కోల్పోయాడు

గ్రేడ్‌ ‘ఎ’+ : రోహిత్‌, విరాట్‌, బుమ్రా, జడేజా (సంవత్సరానికి రూ. 7 కోట్లు). గ్రేడ్‌ ‘ఎ’ : హార్దిక్‌, అశ్విన్‌, షమి, పంత్‌, అక్షర్‌ (రూ. 5 కోట్లు). గ్రేడ్‌ ‘బి’ : పుజార, కేఎల్‌. రాహుల్‌, శ్రేయాస్‌, సిరాజ్‌, సూర్యకుమార్‌, గిల్‌ (రూ. 3 కోట్లు). గ్రేడ్‌ ‘సి’: ఉమేశ్‌, ధవన్‌, శార్దూల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, చాహల్‌, కుల్దీప్‌, సుందర్‌, సంజూ శాంసన్‌, అర్ష్‌దీప్‌, కేఎస్‌ భరత్‌.

Updated Date - 2023-03-27T03:40:12+05:30 IST