Priyanshu : ఫైనల్లో ప్రియాన్షు

ABN , First Publish Date - 2023-04-09T01:12:16+05:30 IST

భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తన జోరు కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

 Priyanshu  : ఫైనల్లో ప్రియాన్షు

ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

ఓర్లీన్స్‌ (ఫ్రాన్స్‌): భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తన జోరు కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రియాన్షు 21-12, 21-9తో ఐర్లాండ్‌కు చెందిన నాట్‌ గుయెన్‌ను చిత్తుచేశాడు. నలభై నాలుగు నిమిషాల పాటు సాగిన ఏకపక్ష పోరులో ప్రియాన్షు ధాటికి ఏమాత్రం బదులివ్వలేకపోయిన ప్రత్యర్థి గుయెన్‌ వరుసగేముల్లో కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షుకు సూపర్‌ 300 వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే తుది పోరులో మాగ్నస్‌ జొహన్నెసెన్‌ (డెన్మార్క్‌)తో ప్రియాన్షు తలపడనున్నాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో ధ్రువ్‌ కపిల- అర్జున్‌ జోడీ 21-16, 11-21, 20-22తో రెండోసీడ్‌ లియో -డానియెల్‌ జంట చేతిలో పోరాడి ఓడింది.

Updated Date - 2023-04-09T01:12:16+05:30 IST