Share News

షమి బౌలింగ్‌కు పాయల్‌ ఫిదా

ABN , First Publish Date - 2023-11-10T02:35:34+05:30 IST

వరల్డ్‌ కప్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు అమోఘ విజయాలు అందిస్తున్న పేసర్‌ మహ్మద్‌ షమికి రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ ‘ఎక్స్‌’ వేదికగా...

షమి బౌలింగ్‌కు పాయల్‌ ఫిదా

బౌలర్‌కు బాలీవుడ్‌ నటి పెళ్లి ప్రతిపాదన

ముంబై: వరల్డ్‌ కప్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు అమోఘ విజయాలు అందిస్తున్న పేసర్‌ మహ్మద్‌ షమికి రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ ‘ఎక్స్‌’ వేదికగా పెళ్లి ప్రతిపాదన పంపింది. ‘షమి..తొలుత నువ్వు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడడం నేర్చుకో. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లాడతా’ అని రాసుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై షమి మాత్రం స్పందించలేదు. కోల్‌కతాలో జన్మించిన పాయల్‌..ఊసరవెల్లి, మిస్టర్‌ రాస్కెల్‌ తదితర తెలుగు చిత్రాల్లో పాటు కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. కాగా 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 33 ఏళ్ల పాయల్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే)లో చేరి..ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.

Updated Date - 2023-11-10T02:35:36+05:30 IST